Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుజరాతీలో శుభాకాంక్షలు, ఆహా! సోదరి మమతకు కృతజ్ఞతలు: మోదీ

మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీల మధ్య ట్వీట్ల రూపంలో కృతజ్ఞతలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధానికి గుజరాతీ భాషలో ట్వీట్ చేస్తూ, మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలుపగా, అందుకు మోదీ తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల మమతా బెనర్జీ ప్రధానికి 'న్యూ ఇయర్ విషెస్'ను గుజరాతీ భాషలో చెబుతూ ఆ రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే స్లోగన్ 'పరివర్తన్ నాహీ పటాన్' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మోదీ, "మీ శుభాకాంక్షలు... అది కూడా గుజరాతీ భాషలో... నా హృదయాన్ని తాకాయి. మమతా సోదరికి నా కృతజ్ఞతలు. 2016 ఆమెకు గొప్పగా ఉండాలి" అన్నారు. ప్రధాని ఈ ట్వీట్ చేసిన రెండు గంటల తరువాత మమత మరో ట్వీట్ పెడుతూ, "నేను గుజరాతీ భాషలో పంపిన శుభాకాంక్షలు మీకు నచ్చడం సంతోషం. మీరు నాకు బెంగాలీలో శుభాకాంక్షలు పంపినందుకు నా కృతజ్ఞతలు" అన్నారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే వెల్లడించలేం కానీ, ప్రస్తుతానికి వీరి ట్వీట్ల పలకరింపులు నెటిజన్ల మధ్య చర్చకు తెరలేపాయి.

More Telugu News